హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి పట్టిన శని రేవంత్‌రెడ్డి అని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయడం ద్వారా శనిని వదిలించుకోవడానికి ప్రజ లు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డికి బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఇప్పటికీ సీఎం హోదాను మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అత్యంత పిరికిపంద అని, ఢిల్లీకి పోయి బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటాడని విమర్శించారు. కేసీఆర్ ప్రచారాన్ని 48 గంటలు ఆపడం వెనుక తెర ముందు కాంగ్రెస్, తెర వెనుక బీజేపీ ఉన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లడంతో కాంగ్రెస్, బీజేపీల్లో వణుకు పుట్టిందని అన్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌పార్టీ ఎప్పటి వరకు సీఎంగా ఉంచుతుందో తెలియదన్నారు. రేవంత్ రెడ్డి భాషపై ఎన్నికల సంఘానికి 8 ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడవ స్థానం ఖాయమని జోస్యం చెప్పారు.