తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కానీ ఇవాళ తెలంగాణ సాధించిన కేసీఆర్ను కేసీఆర్ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ బిడ్డలపై తుపాకీ పట్టుకుని తిరిగి.. నేడు తుపాకీరాముడు ముచ్చట్లు చెబుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. త్వరలోనే తుపాకీ రాముడి తుప్పును ప్రజలు వదలగొడతారని విమర్శించారు.