హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైంది? అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలన్న డిమాండ్లతో విద్యార్థి, నిరుద్యోగులు ఇచ్చిన చలో సెక్రటేరియట్ పిలుపుతో ప్రభుత్వం భయపడిందని తెలిపారు. అన్ని జిల్లాల్లో నిరుద్యోగులను, బీఆర్ఎస్వీ నేతలను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని విమర్శించా రు. రాష్ట్ర యువతను మోసం చేసినందుకు కాంగ్రెస్ నాయకులు ముకు నేలకు రాసి యువతకు క్షమాపణ చెప్పాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.