Devi Prasad | హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ ప్రజలకు 108 అంబులెన్స్ లాంటి వారని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పల్లె రవి కుమార్‌తో కలిసి దేవీ ప్రసాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
పార్టీ గీత దాటుతుందని కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అన్ని ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు పెట్టాలనుకుంటున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్లో కూడా చిచ్చు పెడుతున్నాయి. కాళేశ్వరంలో అవినీతిని ఏజెన్సీలే తేల్చలేకపోయాయి. కవిత లాంటి వ్యక్తి తేలుస్తారా..? హరీష్ రావు కేసీఆర్ సైనికుడు, శ్రామికుడు. హరీష్ రావు ఎలాంటి వారో అందరికీ తెలుసు. కొందరు బురద జల్లినంత మాత్రాన హరీష్ రావు ప్రతిష్ట చెరిగిపోదు అని దేవీ ప్రసాద్ పేర్కొన్నారు.