కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపులు, ప్రతీకార చర్యలు నిత్యకృత్యమయ్యాయని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. దాన్ని తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగుల ధర్నా నేపథ్యంలో జిల్లాల విలీన ప్రక్రియ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు.
కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమానికి పాటుపడ్డారని వినయ్ భాస్కర్ తెలిపారు.తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్‌దే అని కొనియాడారు.