Dasoju Sravan | తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. పూర్వకాలంలో భారతదేశంపై విదేశీయులు దండయాత్రలు చేసి, దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి అదే పంథాలో పయనిస్తూ తెలంగాణ చరిత్రపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ చిహ్నాలపై కూడా దాడి చేస్తున్నాడని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి విధ్వంసం చేస్తుండు అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కాకతీయ కళాతోరణంపై కుల వివక్ష చూపిస్తుండని అన్నారు. చార్మినార్ ఆనవాళ్లను చెరిపివేయాలనే కుట్రలు చేస్తుండని మండిపడ్డారు. బాబాసాహెబ్ విగ్రహాన్ని కేసిఆర్ నిర్మించాడనే కోపంతో అవమానిస్తూ ఉన్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డిని మూర్ఖుడిగా పేర్కొంటూ.. అతని మనసును ఎప్పటికీ మార్చలేమని చెబుతూ భర్తృహరి రచించిన ఒక పద్యాన్ని పోస్టు చేశారు.
దాసోజు శ్రవణ్ ట్వీట్ చేసిన భర్తృహరి పద్యం
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
పూర్వకాలంలో భారతదేశంపై
విదేశీయులు దండయాత్రలు చేసి, దేవతావిగ్రహాలను విధ్వసం చేసినట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పంథాలో పయనిస్తూ తెలంగాణ చరిత్రపై దాడి చేస్తుండు, ఉద్యమ చిహ్నాలపై దాడి చేస్తుండు… @TelanganaCMO @revanth_anumulaతెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి… pic.twitter.com/IIrCgUj59D
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) December 6, 2024