హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షా దివస్‌పై కాంగ్రెస్ సర్కార్ చిల్లర కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు చేపట్టిన ర్యాలీకి అడుగడుగునా కావాలనే ఆటంకాలు కల్పించడం దుర్మార్గమని శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.
కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్యనేతలు చేపట్టిన పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్ట్రీట్లైట్లను బంద్ చేసిందని మండిపడ్డారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఉద్యమకాలంలో కాంగ్రెస్ చేసిన కుట్రలు గుర్తుకు వస్తున్నాయని, భవిష్యత్తులో కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి మిగిలేవి చీకటి రోజులేనని హెచ్చరించారు.