Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో హైడ్రా జులుం ప్రదర్శిస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తా వద్ద అనుమతులు ఉన్న హోర్డింగులను హైడ్రా అధికారులు అక్రమంగా తొలగిస్తూ, వేలాది కుటుంబాల జీవనాధారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టు ఉత్తర్వులను హైడ్రా తుంగలో తొక్కిందని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. హైకోర్టు శనివారాలు, ఆదివారాల్లో హోర్డింగ్ తొలగింపులు చేయరాదని స్పష్టంగా ఆదేశించినా, హైడ్రా అధికారులు కోర్టు ధిక్కరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డర్స్ చెరువుల్లో ఆకాశహర్మ్యాలు కడుతుంటే తలూపని ప్రభుత్వం, పేద మధ్య తరగతి ప్రజలపై తన అధికార ప్రతాపాన్ని చూపించడం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్.
హైడ్రా అధికారుల అక్రమార్జన.. వ్యాపారుల సంచలన ఆరోపణలు
హోర్డింగ్ యజమానులు, వ్యాపారులు హైడ్రా అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తొలగించిన హోర్డింగ్ మెటీరియల్‌ను అవి అమ్ముకుంటున్నారని సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇదంతా వ్యాపారుల రక్తాన్ని పీల్చే కుట్ర కాదా? వేల కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదం ఉందన్నారు. హోర్డింగ్ కార్మికులపై హైడ్రా దాడులకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.
ఈ వ్యాపారం మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, హోర్డింగ్ కార్మికులపై హైడ్రా అధికారులు దాడులు చేశారని వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నిర్దయ పాలన వల్ల వారి జీవనాధారం నాశనమై రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి రోడ్డెక్కే పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం తాను చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ అక్రమాలను తక్షణమే ఆపకుంటే, రేపటి నుంచే రాష్ట్రవ్యాప్త నిరసనలు, ధర్నాలు నిర్వహించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకుని ఈ రాక్షస పాలనకు అడ్డుకట్ట వేయాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైడ్రా గ్యాంగ్ రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరించకూడదని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలపై చేస్తున్న జులుం ప్రయత్నాన్ని ఆపాలి! ప్రజా జీవనాధారాన్ని ధ్వంసం చేసే ఏ నిర్ణయానికైనా కంచే చేను మేసినట్లు!! రేవంత్ రెడ్డి, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి హైడ్రా గ్యాంగ్‌తో కలిసి రాక్షస పాలన సాగించొద్దు! అని దాసోజు శ్రవణ్ అన్నారు.
రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో
హైడ్రా జులుం!తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తా వద్ద అనుమతులు ఉన్న హోర్డింగులను హైడ్రా అధికారులు అక్రమంగా తొలగిస్తూ, వేలాది కుటుంబాల జీవనాధారాన్ని నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం!
కోర్టు ఉత్తర్వులను తుంగలో… pic.twitter.com/pPsfnfjbLk
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) March 2, 2025