తిరుమల : వైజాగ్‌కు చెందిన ఎంకే బిల్డర్స్ ఎండీ రామకృష్ణ ఆదివారం టీటీడీ ( TTD ) కి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా( Donations ) అందించారు. ఈ మేరకు దాత తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు.