హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) డైరెక్టర్‌గా డాక్టర్ రాహుల్ దేవరాజ్(Rahul Devaraj) నియమితులయ్యారు. ఈ మేరకు రాహుల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక ఉత్వర్వులు జారీ చేసింది. ఇతను మూడు సంవత్సారాలు ఈ పదవిలో కొనసాగనున్నాడు.
కాగా, ప్రస్తుతానికి డా. రాహుల్ దేవరాజ్ నిమ్స్ యూరాలజీ విభాగం అధిపతి (HOD)గా సేవలు అందిస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటివరకు జరిగిన 2,000 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లలో (ముఖ్యంగా సౌత్ ఇండియాలో ప్రభుత్వ రంగంలో మొదటి రోబోటిక్ కిడ్నీ మార్పిడి వంటివి), డా. రాహుల్ దేవరాజ్ నాయకత్వంలోని వైద్య బృందం ఎంతో కీలక పాత్ర పోషించింది