Telangana Schools | హైదరాబాద్ : ముందుగా ప్రకటించిన ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆదివారం (జూన్ 12)తో వేసవి సెలవులు ముగిసిపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగించింది. స్కూళ్ల రీ ఓపెన్ తేదీని జూన్ 12వ తేదీ నుండి 15వ తేదీకి వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం కావడంతో పాఠశాలల పున: ప్రారంభ తేదీని మరోసారి పరిశీలించాలని పలు అభ్యర్థనలు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు తిరిగి జూన్ 15న (సోమవారం) రీఓపెన్ కానున్నాయి.
బ్రేకింగ్ న్యూస్
స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం
జూన్ 12వ తేదీ నుండి 15వ తేదీకి రీ ఓపెన్ తేదీని వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు pic.twitter.com/jzliRQ1q4a
— Telugu Scribe (@TeluguScribe) June 7, 2026
Vadde Naveen | వడ్డే నవీన్ సినిమాలో నటించిన సుమ.. 26 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఇంటర్వ్యూ
Chiranjeevi New Movie | మెగా 158 అప్డేట్: చిరంజీవి-బాబీ మూవీలో కన్నడ బ్యూటీ రచితా రామ్!