హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు తల నరికి తీసుకొస్తే తన తండ్రి సంపాదించిన ఎకరం 38 గుంటల భూమిని రాసిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చేసిన వ్యా ఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, అనాగరికంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ విషయంపై శుక్రవారం ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ఈ ప్రకటన తెలంగాణలో అనాగరిక, నేరపూరిత సుపారీ, దిగజారుడు రాజకీయాలు, నాయకత్వానికి నిదర్శనం. రాహుల్‌పై బీజేపీ నేత వ్యాఖ్యలు నిస్సందేహంగా ఖండించదగినవే. ఓ వ్యక్తి తల నరికివేయమని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా పిలుపునివ్వడాన్ని ఎలా సమర్థిస్తారు? ఒక తప్పును సమర్థించడానికి ఇంకొక తప్పు చేయకూడదు. ఈ విషయంలో రాహుల్‌గాంధీ నిర్లక్ష్యంగా ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని అనుకరించడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించడంలో ఆంతర్యం ఏంటి? ఇది ఎలాంటి అక్రమం(జంగల్ రాజా)? ఒక ఎమ్మెల్యే ఐపీసీని ఉల్లంఘిస్తూ ఇలా హింసను ప్రేరేపించగలిగితే, డీజీపీ, తెలంగాణ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు.