KTR | మొహబ్బత్ కీ దుకాన్ కాస్త హిట్లర్ కా మకాన్గా మారింది.. అయినా మౌనమెందుకు.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్
KTR | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో ఇచ్చే జాతీయ నినాదమైన ‘మొహబ్బత్ కీ దుకాన్ కాస్తా.. క్రూర నియంత వారసత్వాన్ని సీఎం రేవంత్ అకున చేర్చుకోవడంతో తెలంగాణలో ‘హిట్లర్ కా మకాన్' (హిట్లర్ ఇల్లు)గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు.
KTR | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో ఇచ్చే జాతీయ నినాదమైన ‘మొహబ్బత్ కీ దుకాన్ కాస్తా.. క్రూర నియంత వారసత్వాన్ని సీఎం రేవంత్ అకున చేర్చుకోవడంతో తెలంగాణలో ‘హిట్లర్ కా మకాన్’ (హిట్లర్ ఇల్లు)గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తన సిద్ధాంతాల ముసుగును తొలగించి, అధికారికంగా తన పేరును ఆలిండియా నాజీ పార్టీగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నైతికతలోని ద్వంద్వ ప్రమాణాలను సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. ‘ఢిల్లీలో కూర్చొని మిమ్మల్ని మీరు రాజ్యాంగ రక్షకుడిగా ప్రకటించుకొంటూ తిరగడం.. మీరే స్వయం గా నియమించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, రక్తపిపాసి అయిన అడాల్ఫ్ హిట్లర్‌ను బహిరంగంగా కీర్తిస్తూ, అతని ‘హత్యల దళాన్ని’ (అసాసినేషన్ స్వాడ్స్) తన పాలనా స్ఫూర్తిగా చెప్పుకొంటుంటే చూస్తూ మౌనంగా ఉండటమేంటి?’ అని ప్రశ్నించారు. ఇది కేవలం ఫాసిస్ట్ (నియంతృత్వ) పరిపాలనా మానసిక స్థితికి నిదర్శనం మాత్రమే కాదని, మన దేశ పునాది విలువలపై జరిగిన క్షమించరాని దాడిగా అభివర్ణించారు.
‘నియంతృత్వ పద్ధతులను అభినందించడం, స్థానిక కూల్చివేతలను అంతర్జాతీయ యుద్ధప్రాంతాల విధ్వంసంతో గర్వంగా పోల్చుకోవడమే మీ పార్టీ అసలైన పరిపాలనా విధానమైతే.. ఏఐసీసీ తన భావజాల ముసుగును తొలగించి, తన పేరును అధికారికంగా ‘ఆలిండియా నాజీ పార్టీ’గా మార్చుకోవాలి’ అని కేటీఆర్ సూచించారు. రేవంత్‌రెడ్డి నియంతృత్వ ధోరణిని రాహుల్‌గాంధీ మౌనంగా సమర్థిస్తున్నారని, దీనిని దేశమంతా గమనిస్తున్నదని పేర్కొన్నారు. హిట్లర్ సిద్ధాంతాలతో సీఎం రేవంత్ పోల్చుకోవడంపై రాహుల్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

