Devdutt Padikkal | టెస్టుల్లో మొదటి శతకం.. గంగూలీ తర్వాత తొలి ఆటగాడిగా పడిక్కల్..!
Devdutt Padikkal : శ్రీలంక పర్యటనలో అంచనాలు అందుకున్న దేవ్‌దత్ పడిక్కల్(Devdutt Padikkal) టెస్టుల్లో మొట్టమొదటి శతకంతో చెలరేగాడు. వామప్ మ్యాచ్‌లో వందతో జట్టును ఆదుకున్న ఈ కుర్రాడు.. గాలే టెస్టులోనూ దంచేశాడు.
Devdutt Padikkal : శ్రీలంక పర్యటనలో అంచనాలు అందుకున్న దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) టెస్టుల్లో మొట్టమొదటి శతకంతో చెలరేగాడు. వామప్ మ్యాచ్‌లో వందతో జట్టును ఆదుకున్న ఈ కుర్రాడు.. గాలే టెస్టులోనూ దంచేశాడు. కేఎల్ రాహుల్(77)తో 150 ప్లస్ భాగస్వామ్య నెలకొల్పిన పడిక్కల్ టీ సెషన్ తర్వాత సెంచరీ అందుకున్నాడు. నువాంత ఓవర్లో సింగిల్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి మూడంకెల స్కోరందుకున్నాడీ లెఫ్ట్ హ్యాండర్. ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో వ్యక్తిగత మైలురాయిని సాధించిన పడిక్కల్‌ను కోచ్ గౌతం గంభీర్, సహచరులు అభినందించారు.
గాలే టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ రికార్డు శతకం కొట్టాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(32) రనౌటయ్యాక క్రీజులోకి వచ్చిన పడిక్కల్ సెంచరీతో కదం తొక్కాడు. లంచ్ అనంతరం జోరు పెంచిన అతడు.. టీ సెషన్ తర్వాత లహిరు కుమార ఓవర్లో వరసగా రెండు ఫోర్లతో 90లోకి వచ్చాడు. అనంతరం నువాంత ఓవర్లో సింగిల్ తీసి.. సుదీర్ఘ ఫార్మాట్లో మొట్టమొదటి శతకం సాధించాడు పడిక్కల్.
MAIDEN TEST HUNDRED! 💯
A special moment on a special day for Devdutt Padikkal in Galle 🥳
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/8x1HcYeFbA
— BCCI (@BCCI) August 15, 2026
ఇప్పటి వరకూ రెండు ఫిఫ్టీలకే పరిమితమైన అతడు.. ఈసారి తన సెంచరీ కలను సాకారం చేసుకున్నాడు. తద్వారా.. 21వ శతాబ్దంలో మూడో స్థానంలో ఆడుతూ టెస్టు వంద కొట్టిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడీ కుర్రాడు. 2022లో జింబాబ్వేపై సౌరవ్ గంగూలీ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత.. పలువురు మూడో స్థానంలో ఆడినా.. ఎవరూ మూడంకెల స్కోర్‌కు ముందే ఔటయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

