మెదక్ : కాంగ్రెస్ గుండాల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. అధికారంలో వచ్చనప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మెదక్(Medak) జిల్లా రామాయం పేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై(BRS Councillor) కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచమ్మల గణేష్ ఒంటిపై పెట్రోల్ పోసి దాడికి(Attacked) పాల్పడ్డాడు.
గమనించిన బీఆర్ఎస్ నాయకులు వెంటనే నాగరాజును ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కామారెడ్డిలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, నాగరాజుపై దాడిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడటం ఆటవిక చర్యగా ఆక్షేపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బీఆర్ఎస్ కౌన్సిలర్‌పై దాడి చేసిన కాంగ్రెస్ నేత
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి దాడి చేశాడు. pic.twitter.com/vURCiw1P9V
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2024