Group 1 Mains | గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు నుంచి 8 నెలల లోపు రీ- వాల్యూషన్ లేదా రీ- మెయిన్స్ పరీక్ష పెట్టాలని హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని కొనియాడారు.
హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో న్యాయం నిలబడిందని.. ధర్మం గెలిచిందని ఆయన అన్నారు. ఇది గ్రూప్ 1 బాధితుల, నిరుద్యోగుల విజయమని అన్నారు. గతంలో గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయని BRS పార్టీ పక్షాన వాస్తవాలు ప్రజలముందు పెట్టానని గుర్తుచేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితో టీజీపీఎస్సీ తనకు నోటీసులు ఇచ్చి గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని విమర్శించారు. మరి ఇప్పుడు హైకోర్టు తీర్పునకు ఏం సమాధానం చెబుతారో అని ప్రశ్నించారు.
గ్రూప్ 1లో జరిగిన అవకతవకల్లో బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగడుగునా అండగా నిలిచారని ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను అంగట్లో కూరగాయల లెక్క అమ్ముకోవాలని పన్నిన కుట్రలకు హైకోర్టు అడ్డుకట్ట వేయడం చారిత్రాత్మక తీర్పుగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.
✒️గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు.
✒️ఈ రోజు నుండి 8 నెలల లోపు రీ- ఇవ్వాల్యూషన్ లేదా రీ- మెయిన్స్ పరీక్ష పెట్టాలని హైకోర్టు తీర్పు నివ్వడం హర్షణీయం.
✒️ఈ తీర్పుతో న్యాయం నిలబడింది. ధర్మం గెలిచింది. ఇది #Group1 బాధితుల, నిరుద్యోగుల విజయం.
✒️… pic.twitter.com/83Up9JaBP9
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) September 9, 2025