జగిత్యాల, మే 26(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగల ని, ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రైతు సమస్యలను పకదోవ పట్టించాలని పెట్రోల్, డీజిల్ ధరలపై ధర్నాలు చేపట్టి, రైతు కష్టాలు దాచిపెట్టాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎకడా లేనివిధంగా రాష్ట్రంలో వ్యాట్ పన్ను ఉన్నదని, ప్రభుత్వానికి పేదలపై ప్రేముంటే వ్యాట్‌ను 35శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, రేవంత్‌రెడ్డి పాలనపై విద్యార్థులు, యువత, మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో అమ లు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను, కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్ర జలకు వివరిస్తూ సభ్యత్వాలు నమోదు చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి పనిచేయాలని, సభ్యత్వ నమోదులో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మారెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ ప్రియాంక, రాయికల్ మున్సిపల్ చైర్మన్ రవీందర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కౌన్సిలర్లు, సర్పంచులు వివిధ గ్రామాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.