కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 26 (నమజ్తే తెలంగాణ) : మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమవుతున్నది. అక్కడ రోజురోజుకూ పార్టీకి ఆదరణ పెరుగుతున్నది. వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూకడుతున్నారు. బుధవారం బల్లార్షా, వీసాపూర్, రాజూర ప్రాంతాలకు చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఆసిఫాబాద్‌లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మిని కలిశారు. అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్లో చేరేందుకు తరలివెళ్లారు.
సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. బల్లార్షా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభుదాస్ తాండ్ర, బీజేపీ కౌన్సిలర్లు స్వామి రాయబరన్, నిషాంత్ ఆత్రం, కాంగ్రెస్ కౌన్సిలర్, బీజేపీ నాయకుడు రాజు రాల్పెలే, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రశాంత్ గద్దాల, ప్రదీప్, కాంగ్రెస్ నాయకులు సునీల్ కల్వాల, తగరం ధర్మరాజ్, నగేశ్ మంతెన, గడ్చిరోలికి చెందిన అనోడ్ గాల్పెలే (బీజేపీ మాజీ ఎమ్మెల్యే దేవేందర్ హోడీ పీఏ), ప్రవీన్ లిప్తే తరలివెళ్లారు.