హైదరాబాద్ : దేశ ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు బయలు దేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద్, మాధవరం కృష్ణరావుతో కలిసి మాట్లాడారు. దేశంలో నదుల నుంచి వస్తున్న నీరు సముద్రంలోకి వృథాగా పోతుందని అన్నారు.
నీటిని ఒడిసిపట్టి ఇంటింటికి మంచి నీరు అందించాలని కృత నిచ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ఉన్నారని తెలిపారు. రైతు బంధు, దళితబంధు, వ్యవసాయ దారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా వల్ల ఉత్పత్తి పెరిగి ఆహార కొరత తీరడంతో పాటు వ్యవసాయదారులు ఆర్థికంగా ఎదుగుతారని అన్నారు. కేంద్రంలో ఉన్న పాలకులు ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఆరోపించారు. దేశ సంపదను కొందరిచేతలో పెట్టడం విచారకరమని అన్నారు.
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ దేశ రాజకీయాలలో కీలక మార్పులకు నాంధిగా మారనుందని పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీకి తొలి విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, రాజ్ జితేంద్రనాథ్, అనిల్‌కిశోర్, జీఎన్వీ సతీశ్‌కుమార్, గుండా నిరంజన్ పాల్గొన్నారు.