టౌన్, మార్చి 10 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తానుంచి లక్ష్మీటాకీసు చౌరస్తా వరకు బీఆర్ఎస్ హయాంలో రూ. 4 కోట్లతో నిర్మించిన నాలుగు జంక్షన్లను కుదింపు పేరిట కూల్చివేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేపట్టగా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆయన తనయుడు విజిత్రావుతోపాటు బీఆర్ఎస్ నాయకులను పట్టణ సీఐ ప్రమోద్‌రావు పోలీసులతో కలిసి పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. ఐడీపార్టీ కానిస్టేబుల్ లక్ష్మణ్ విజిత్‌రావును బలవంతంగా పక్కకు తప్పించేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు విజిత్‌రావును పోలీసు వాహనంలో ఎక్కించడానికి ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.