సిద్దిపేట, ఫిబ్రవరి 13( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో కారుజోరు కొనసాగింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని (హుస్నాబాద్, చేర్యాలను కలుపుకొని) మొత్తం 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక, గజ్వే ల్, చేర్యాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
మెదక్ జిల్లాలో తూప్రాన్, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రే శం, ఇస్నాపూర్, జిన్నారం, జహీరాబాద్ ము న్సిపాలిటీల్లో గులాబీజెండా ఎగిరింది. నర్సాపూర్‌లో ఎక్స్ అఫీషియో ఓట్లతో మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నా యి. మొత్తంగా 19 మున్సిపాలిటీలకు 11 చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. మరో ఒకటి రెండు మున్సిపాలిటీలను ఎక్స్అఫీషియో ఓట్లతో దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.