స్వరాష్ట్రం సిద్ధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ప్రగతి బాట పట్టి కళకళలాడిన పల్లె, పట్టణాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో అధ్వానంగా మారాయి. అభివృద్ధి, మౌలిక సదుపాయాలతోపాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆహ్లాదం పంచేలా రూపుదిద్దుకున్న ప్రకృతి వనాలు, పరిశుభ్రమైన వాతావరణం దేశం దృష్టిని ఆకర్షించి ఎన్నో అవార్డులు అందుకున్నాయి.
ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లోనూ జంక్షన్లను తీర్చిదిద్ది కొత్త అందం తెస్తే.. ప్రస్తుతం వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో కళతప్పాయి. కేసీఆర్ సర్కారు ఎంతో తపనతో నిధులకు సైతం వెనుకాడకుండా రాష్ట్రమంతటా ప్రగతి వెలుగులు పంచితే.. ఇవాళ రేవంత్ సర్కారు మాత్రం ‘కేసీఆర్ ముద్ర’ ఉన్నదనే కక్షతో వాటిపై శీతకన్ను వేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ సర్కారు ఎంతో ముందుచూపుతో శ్రద్ధగా పనులు చేయిస్తే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏమీపట్టనట్టు మొద్దునిద్రపోతున్నదని జనం మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరి వీడి అభివృద్ధిపై దృష్టిపెట్టాలని హితవు పలుకుతున్నారు. అధికారయంత్రాంగం కూడా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేలా ఆదేశాలిచ్చి, సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
‘చెత్త’చెరువు!

గుర్రపు డెక్క, చెత్తాచెదారంతో నిండి కంపుకొడుతున్న ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ చెరువు. ఆ దారిన వెళ్లే ప్రజలు దుర్వాసన భరించలేక ముక్కులు మూసుకోవాల్సి వస్తున్నది.
డంపు.. కంపు

తడి, పొడి వ్యర్థాల కోసం బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటుచేసిన సెగ్రిగేషన్ షెడ్లు నిర్వహణ లేక మూలనపడ్డాయి. రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి ఉండటంతో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోతున్నది. ఇది ఖమ్మం జిల్లాలో దుస్థితి.
ట్యాంకర్ రి‘టైరు’

బీఆర్ఎస్ సర్కారు ‘పల్లె ప్రగతి’లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఊరి అవసరాల కోసం రూ.10 లక్షలతో నీటి ట్యాంకర్‌ను సమకూర్చగా, నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో ఇలా టైరు ఊడిపోయి మూలనపడింది.
కిటికీలకు అట్టలు..

చలికి ఇక్కట్లు మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో కిటికీలు దిబ్బతినడంతో అట్టలు అడ్డుపెట్టి.. చేతులు దులుపుకోవడంతో చలికి గజగజ వణుకుతున్న చిన్నారులు, వారి కుటుంబసభ్యులు
నాడు కరీంనగర్ మీదుగా వరంగల్ వెళ్లే దారిలో బీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి రోడ్డు.. నగరానికి కొత్తందం తెచ్చింది. ఫారిన్ కంట్రీల్లో కనిపించే ఇలాంటి కట్టడం ఇప్పుడు మనకూ ఉందంటూ ప్రజలు సంబురపడ్డారు.

కరీంనగర్‌కే ఐకాన్‌గా నిలిచిన కేబుల్ బ్రిడ్జ్ నేడు గుంతలమయమై అధ్వానంగా మారింది. కరీంనగర్-వరంగల్ దారిలో ఉన్న తీగల వంతెనపై అటుగా వెళ్లే ప్రయాణికులు ఆగిమరీ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు ప్రమాదకరంగా ఉన్న గుంతలతో అటు వెళ్లాలంటేనే జంకుతున్నారు.
నాడు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం శివాజీనగర్‌లో తీరొక్క మొక్కలతో కళకళలాడిన పార్కు

నేడు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం శివాజీనగర్‌లో ఎండిపోయిన రాశీ నక్షత్ర వనం
నాడు ఖమ్మం సర్కారు దవాఖానలో పురుడు పోసుకున్న తర్వాత కేసీఆర్ కిట్ అందుకొని మురిసిపోతున్న తల్లీబిడ్డ

కాంగ్రెస్ సర్కారు వచ్చాక సర్కారు దవాఖానలో ప్రసవించిన తల్లులకు ‘కేసీఆర్ కిట్’ దూరమైంది. ఖమ్మం దవాఖానలో నిరాశతో ఓ తల్లి ఎదురుచూపులు.
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కొండాపూర్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక నమూనా ప్రజలకు కొత్త అనుభూతినిచ్చింది. ఐకానిక్ వ్యూ అద్భుతం అంటూ సంబురపడిపోయారు.

ఇప్పుడు అదే చోట ప్రత్యేక నమూనాను తొలగించి ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటు చేయడంతో కళావిహీనంగా కనిపిస్తున్న ప్రధాన కూడలి
నాడు బీఆర్ఎస్ హయాంలో నల్లగొండలోని రాజీవ్‌పార్కులో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఓపెన్‌జిమ్‌లో కసరత్తు చేస్తున్న చిన్నారులతో సందడి వాతావరణం

నిర్వహణ లోపం వల్ల ఊడిపోయిన రబ్బర్ టైల్స్, పరికరాలతో ఓపెన్ జిమ్ కళతప్పడంతో ఖాళీగా దర్శనమిస్తున్న రాజీవ్‌పార్కు.