సంగారెడ్డి : రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర, ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పఠాన్‌చేరు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులనుద్ధేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్ చేరని అన్నారు. జిల్లాలో 830 మందికి జీవో నంబర్ 58 ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు.
పేదల కోసం రాష్ట్రంలోని అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గం లో 13 బస్తీ దవఖానాలను ఏర్పాటు చేశానని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను,బీఆర్ఎస్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, టీఎస్ఎం ఐసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.