హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ర్యాలీపై పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ డిసెంబర్ 12కు వాయిదా పడింది. జూన్ 1న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు క్యాం డిల్ ర్యాలీ నిర్వహించగా సైఫాబాద్ పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
అన్ని అనుమతులు తీసుకున్నాకే తాము క్యాండిల్ ర్యాలీ నిర్వహించామని శ్రీనివాస్‌రెడ్డి తరఫు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ కోర్టుకు నివేదించారు. ఈ కేసుపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తామని తెలిపారు. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసిం ది. కోర్టు ప్రాంగణంలో శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అమరులకు నివాళులు అర్పించే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.