Vinod Kumar | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదు అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సమాజంలో ప్రజల అంశాలపై ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేయడం రాజ్యాంగ విరుద్ధం అని మండిపడ్డారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్ సర్కార్ అని విమర్శించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నడు రేవంత్ రెడ్డి అని వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం. అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలను న్యాయపరంగా ఎదుర్కొంటాం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.