Nama Nageshwar Rao | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఈరోజు ఆయన పేరు రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం గుర్తుకురాలేదు అని నిలదీశారు. ఇవాళ నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ అభిమాని మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఎన్నికలో సునీతకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. మూడు సార్లు గోపీని ఆదరించినట్లే సునీతను ఆదరించాలి. 1983 నుంచి చివరి వరకు ఎన్టీఆర్ వెంట ఉన్న నేత మాగంటి గోపీనాథ్. పదేళ్లలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో, హైదారాబాద్‌లో కనీవిని ఎరగని అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి చూసే మొన్నటి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు అని నామా నాగేశ్వర్ రావు గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ ఇవాళ గుర్తుకు వచ్చారా? ఖమ్మంలో 60 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని మేము పెట్టాం, ఎన్టీఆర్ చరిత్రను గ్రానైట్‌పై రాశాం. ఎన్టీఆర్ చరిత్ర ఉన్న గ్రానైట్ రాళ్లను తొలగించారు. ఇవాళ ఉప ఎన్నిక కోసం ఎన్టీఆర్ విగ్రహం అని మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం. రాజకీయ అవకాశాల కోసం అన్ని పార్టీలు తిరిగిన వారు రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. సామాజిక వర్గం మొత్తం తనవైపే ఉందని చెప్పడం సరికాదు అని మాజీ ఎంపీ నామా పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిని చూసి ప్రజలు తీర్పు ఇవ్వాలి. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఎలా సాగుతుందో అందరమూ చూస్తున్నాం. మాగంటి సునీతను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని నామా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
కేసీఆర్ ఇక్కడ స్థిరపడ్డ పక్క రాష్ట్రాల వారిని అక్కున చేర్చుకున్నాడు. రామోజీ రావును పక్కా రాష్ట్రం పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తే, నా రాష్ట్రం నుండి ఎవరిని అరెస్టు చేయడానికి వీలు లేదని, రామోజీ రావు మీద చెయ్యి కూడా పడకుండా కేసీఆర్ అడ్డుకున్నాడు అని నామా నాగేశ్వర్ రావు తెలిపారు.
కేసీఆర్ గారు ఇక్కడ స్థిరపడ్డ పక్క రాష్ట్రాల వారిని అక్కున చేర్చుకున్నాడు
రామోజీ రావును పక్కా రాష్ట్రం పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తే, నా రాష్ట్రం నుండి ఎవరిని అరెస్టు చేయడానికి వీలు లేదని, రామోజీ రావు మీద చెయ్యి కూడా పడకుండా కేసీఆర్ అడ్డుకున్నాడు –బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా… pic.twitter.com/fqEg10F72d
— Telugu Scribe (@TeluguScribe) November 6, 2025