హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తే మెచ్చుకుంటామని, అదే సమయంలో చెడు పనులు చేస్తే ఎత్తిచూపి ఎండగడతామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరి కనీసం నాలుగు రోజులైనా కాలేదని, ఇప్పుడే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరైంది కాదని తాము భావించామని, కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు సృష్టిస్తున్న జుగుప్సాకరమైన అంశాలపై మాట్లాడాల్సి వస్తున్నదని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును తాము గౌరవిస్తామని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సం పూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. తమ పార్టీ నాయకులు, ఓడినంత మాత్రాన ప్రజలకు దూ రంగా ఉంటారని అనుకోకూడదని చెప్పారు.
తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతాం
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం బీఆర్ఎస్ పార్టీ అనేక త్యాగాలు చేసిందని వినోద్‌కుమార్ తెలిపారు. తాము కచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతామని, ప్రజలకు మంచిచేస్తే అభినందించడం తమ సంస్కారమని పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై ఉన్న శిలాఫలకాలను కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేయడం దారుణమ ని పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని రాసి ఉన్న శిలాఫలకంపై మట్టిపూయడం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లో, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల శిలాఫలకాలపై ఉన్న పేర్లు అంటే కాంగ్రెస్ పార్టీకి అ క్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్‌వి అప్రజాస్వామిక చర్యలు గొల్ల, కురుమల సంఘం నేత గోసుల
ఎన్నికల్లో గెలిచిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ నేతలు అప్రజాస్వామిక దా డులకు పాల్పడుతున్నారని, గత ప్రభుత్వం నిర్మించిన ప్రజా ఆస్థులను కూడా ధ్వంసం చేస్తు న్నారని గొల్ల, కురుమల సంఘం నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. అధికారంలోకి రాగానే కక్షసాధింపులో భాగంగా దాడులకు పా ల్పడటం సిగ్గుచేటని సోమవారం తెలిపారు.