Dasyam Vinay Bhasker | వరంగల్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ రాష్ట్ర ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. వేటాడుతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వచ్చినా ఖబడ్దార్ అని హెచ్చరించారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 29వ డివిజన్ రామన్నపేటలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ యూత్ కార్యాలయాన్ని ఆయన ఆదివారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా రామన్నపేటకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 మంది యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి దాస్యం వినయ్ భాస్కర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించినా.. తమ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేసే స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెబుతున్నాను. రానున్న రోజుల్లో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
29వ డివిజన్ ప్రజల ఓట్లతో గెలిచి… ఇక్కడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుదాం… 2 సార్లు వారికి రాజకీయ భిక్ష పెట్టింది ఇక్కడి ప్రజలే. రానున్న రోజుల్లో ఇక్కడి ప్రజల అభీష్టం మేరకు పని చేసే వారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది. 29వ డివిజన్లో గత ప్రభుత్వ హయాంలో 27 కోట్ల నిధులతో 344 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 1200 పైగా పెన్షన్లు అందించడం జరిగింది. 500 మంది ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి ద్వారా రూ.1, 00, 016 చొప్పున అందించడం జరిగింది. దాదాపు 50 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగింది అని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు.
ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్ష మేరకు పని చేశా. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కొట్లాడాను. ఆ తరువాత క్రమంలో ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సెక్రటరీగా, ప్రభుత్వ చీఫ్ విప్‌గా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా కృషి చేశాను. ఎన్నికల్లో ఓడినా నేటికి సైతం ప్రజల కోసం… ప్రజలు తరపున పోరాడుతున్న. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోంది అని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఇచ్చి .. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది.
16 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్న ప్రజలను బెదిరించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలి. తెలంగాణ ప్రజలు ఎవరు భయపడవద్దు … రానున్నది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయే… ప్రజల ఆకాంక్షల మీరకు పని చేసేదే బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వద్దిరాజు గణేష్, నాయకులు షఫీ, రమేష్, చందు, రాజు, తహసిల్, నాగమణి, లక్ష్మి, రహీం, శ్రీను , రూపేష్ పాల్గొన్నారు.
నూతనంగా పార్టీలో చేరిన వారు వీరే..
బుస్సా శేఖర్, శివ కుమార్, రూపేష్, సాయి ప్రశాంత్, ప్రసాద్, రోహిత్, అభిలాష్, శ్యాం కుమార్, విజయ, అనిత, కుమారి రంజిత, రాధమ్మ, రేణుక, పావని, జ్యోతి తదితరులు ఉన్నారు.