దేశ భవిష్యత్తుకు భరోసా.. ఖమ్మం సభ: గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutta Sukender reddy | దేశానికి మంచి భౌష్యత్తు ఇచ్చేలా ఖమ్మం సభ జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశాన్ని లౌకికశక్తిగా ఉంచేలా ఖమ్మం సభ మార్గదర్శనం చేసిందన్నారు.
నల్లగొండ: దేశానికి మంచి భౌష్యత్తు ఇచ్చేలా ఖమ్మం సభ జరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశాన్ని లౌకికశక్తిగా ఉంచేలా ఖమ్మం సభ మార్గదర్శనం చేసిందన్నారు. అవగాహన లేక ఆరోపణలు చేసేటోళ్లకు ఈ సభ సరైన సమాధానం చెప్పిందని వెల్లడించారు. ప్రతిపక్షాలకు అధికార యావ తప్ప మరో ఆలోచన లేదని విమర్శించారు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కేంద్రపై పోరాటం మొదలైందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలులో ఉన్నాయా అని ఆ పార్టీ నేతలు ప్రశ్నించుకోవాలని సూచించారు.
ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ కేంద్రం దుర్నీతికి పాల్పడుతున్నదని విమర్శించారు. కేంద్రానిది వ్యాపార దృక్పథమని, దేశానికి అది మంచిది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజం పాలనలో కూడా ఎన్నో మంచి పథకాలు అమలుచేశారని వెల్లడించారు. హైదరాబాద్‌లో నిజం ఆఖరి వారసుడి అంత్యక్రియలపై కూడా రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గమని చెప్పారు. ఓట్ల కోసం మత రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
ఎవరైనా గౌరవం కాపాడుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఉద్దేశించి అన్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వం పంపించిన ఏడు బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా తనవద్దే పెట్టుకున్నారని, మరి అభివృద్ధి ఎలా జరుగుతుందనే ఆలోచన చేయాలని సూచించారు. అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లులను కూడా ఆపడం ఏంటని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి జోకర్లా తయారయ్యాడని, అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

