హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ): ‘ఇది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ప్రజాకంటక పాలన. ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరితే ఇంత నిర్బంధమా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేస్తరా? తెల్లదొరల పాలనకన్నా దుర్మార్గంగా కాంగ్రెస్ సరారు వ్యవహరిస్తున్నది. ప్రచారంలో ఓ మాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రెండు నాలల వైఖరి యువతకు అర్థమైంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన ఉద్యోగార్థులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును, నిరుద్యోగుల అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఉద్యోగాల భర్తీ, గ్రూప్స్ నోటిఫికేషన్ల సమస్యల పరిష్కారం, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ, విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని, యువతను కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని, ఇది నయవంచక సర్కారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌కు యువతపై ప్రేమ లేదని, నిరుద్యోగులంటే అసలే గౌరవం లేదని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగార్థులు, విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శమని చెప్పారు.
అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇదే నిరుద్యోగులతో స్వయంగా రాహుల్‌గాంధీతో కాంగ్రెస్ మిలాఖత్లు ఏర్పాటు చేయించి అధికారంలోకి రాగానే వారిని అణచివేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టి నిరుద్యోగులను వాడుకొని ఇప్పుడు వదిలేసిందని, న్యామమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరితే నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు.
ప్రజాపాలన పేరును పదేపదే వల్లెవేసే కాంగ్రెస్ సరారు యువకులు, విద్యార్థులకు కనీసం నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఉద్యోగ నియామకాలు, జాబ్ క్యాలెండర్ విడుదలలో అట్టర్‌ఫ్లాప్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం, నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ సరారును భూస్థాపితం చేయడం ఖాయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.