KCR | తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో పండుగ ఈ జరుపుకుంటారని అన్నారు.
అదే సందర్భంలో.. త్యాగానికి గుర్తుగా హిందూ ముస్లింలు ఐక్యంగా పీర్లపండుగగా నేడు జరుపుకుంటున్న మొహర్రం.. తెలంగాణ గంగా జమున సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడేందుకు మరింతగా కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.
ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది.. ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని అభివర్ణించేవారని పురాణాలు చెబుతున్నా యి. శ్రీమహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండడంతో తొలి ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు.. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైంది.. 24 ఏకాదశుల్లో ఉపవాసం చేయలేకపోయిన.. ఒక్క ఈ తొలి ఏకాదశి రోజు దీక్ష చేస్తే కోటి పు ణ్యాలకు సాటి అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయన్నది నమ్మకం..