హైదరాబాద్ జూన్ 12 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నివాసాలపై విమానం కూలిపోయిన ఘటనలో ప్రయాణికులు, సామాన్యులు, వైద్య విద్యార్థులు మరణించడంపై ఒక ప్రకటనలో విచారం వ్యక్తంచేశారు.
ఆప్తులను కోల్పోయి శోకతప్త హృదయులైన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కేంద్రంతోపాటు గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.