హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తం పూజలు, ప్రార్థనలు చేశారు. ఆదివారం హైదరాబాద్ శ్రీనగర్‌కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కేసీఆర్ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కుటుంబీకులు విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరి, నిఖిల్చంద్ర, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు గంగుల సందీప్, గంగాభవానీ తదితరులు పాల్గొన్నారు.