Vanteru Prathap Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మాతృ వియోగంతో శోకతప్త హృదయులైన వంటేరు ప్రతాప్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వజ్రమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డిని పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా నివాళులర్పించారు.