Gangula Kamalaker | కరీంనగర్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల నర్సమ్మ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నర్సమ్మ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గంగుల నర్సమ్మ మృతిపట్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సంతాపం ప్రకటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే @GangulaBRS మాతృమూర్తి గంగుల నర్సమ్మ గారి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
— BRS Party (@BRSparty) October 22, 2024
ఇవి కూడా చదవండి..
KTR | నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులపై పోరాటం చేస్తా : కేటీఆర్
KTR | ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం.. ఇదిగో సాక్ష్యం : కేటీఆర్
KTR | అందిన కాడికి దోచుకో.. బామ్మర్ది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్