KCR | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ కొనసాగింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జంట నగరాల పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు.