KCR | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. పులిని ఎందుకు బోనులో వేస్తారు..? ఏ కారణం చేత వేస్తారు అని రేవంత్‌ను కేసీఆర్ నిలదీశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
ప్రజలకు కోపం తెప్పించింది ఏందంటే.. శాసనసభలో కానీ బయట కానీ అంత గలీజ్‌గా, చండాలంగా మాట్లాడారు. జనరల్‌గా పార్టీ నాయకులు, ప్రజలు కేసీఆర్‌ను టైగర్ అంటరు. పులిని బోనులో వేస్తాం.. చర్లపల్లి జైల్లో వేస్తాం. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టిస్తాం అని దురుసుగా మాట్లాడి ఒక దర్మార్గమైన పద్ధతిలో దుర్భషలాడారు. పులిని ఎందుకు బోనులో వేస్తారు.. ఏ కారణం చేత వేస్తారు అని కేసీఆర్ నిలదీశారు.
2014-15లో తలసరి ఆదాయం లక్షా 24 వేలు ఉంటే 2024 వరకు 3 లక్షల 13 వేలకు తీసుకుపోయాం. అది కేసీఆర్ చేసిన తప్పా..? దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణను నంబర్ వన్ చేయడం తప్పా..? తెలంగాణ జీఎస్డీపీ 2014లో 4.17 లక్షలు ఉంటే 2024 వచ్చే సరికి 14.5 లక్షలకు తీసుకుపోయాం. దేశ సగటు కంటే చాలా ఎక్కువ పురోగతి సాధించాం. దాని కోసం కేసీఆర్‌ను నిందించాలా..? వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను అందించినందుకు కోసం దుర్భషలాడాల్నా..? మోటార్లకు మీటర్లు పెట్టాలని రూ. 25 వేల కోట్ల కట్ చేసిన మీటర్లు పెట్టలేదు. ఆ విషయంలో రైతులను కాపాడినందుకు దుర్భషలాడాల్నా..? వడ్ల ఉత్పత్తిలో పంజాబ్‌ను తలదన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుకు దుర్బషలాడాల్నా..? అని కేసీఆర్ నిలదీశారు.
రాష్ట్రంలో పచ్చదనంలో 7 శాతం గ్రీనరీ పెంచారని గ్రీన్ అథారిటీ వారు ఎన్నో అవార్డులు ఇచ్చారు. సంక్షేమంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం. దిక్కు, గతి లేక ఇంకెక్కడి తెలంగాణ అని పడుకున్న సమయంలో నేను ఒక్కడిగా బయల్దేరి 14 ఏండ్లు పోరాటం చేసి అవమనాలు భరించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పటు చేసి అన్ని రంగాల్లో అద్భుతమైన విజయం సాధించాం. అంత అద్భుత విజయాలు సాధించిన వ్యక్తిని తిడుతుంటే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా.. గుండె తడి ఉన్నోళ్లకు, తెలంగాణ అస్థిత్వం ఉన్నోళ్లకు సహజంగానే బాధ కలుగుతది. అడ్డగోలుగా దుర్భషలాడటం, మాట్లాడం సరికాదు. ప్రజల ఆగ్రహాం చవి చూడబోతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు.