KCR | బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణవాది ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్.. ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది కేవలం నాకు జరిగిన సత్కారమే కాదు.. నాలాంటి ఎందరో తెలంగాణ వాదులకు జరిగిన సత్కారమని అన్నారు.
తెలంగాణ జాతిని మేల్కొల్పిన ఉద్యమ రథ సారథి, తెలంగాణ ప్రగతి ప్రదాత కేసీఆర్ అని శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. కేసీఆర్ వద్ద 25 ఏండ్ల పాటు పనిచేయడం తన అదృష్టమని.. తనకు దక్కిన గొప్ప అవకాశమని తెలిపారు. కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని అన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ జీవితం అర్పితం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ మాదిరి తన ప్రజల పట్ల అంతగా నెనరున్న జననేత మరెక్కడా కానరాడని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానం శాశ్వతంగా ఉండిపోతుందని చెప్పారు.
20 యేండ్లుగా తెలంగాణ భవన్ ఇంఛార్జిగా, బీఆర్ఎస్ పార్టీకి సుదీర్ఘ సేవలందించిన ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారిని గౌరవప్రదంగా సన్మానించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. pic.twitter.com/YBb0src2AE
— BRS Party (@BRSparty) November 28, 2024
ప్రేమతో మీ కేసీఆర్.. (విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్) అని నాకు వేసిన లాకెట్.. నాలాంటి తెలంగాణ వాదులందరికీ వేసిందిగా భావిస్తున్నానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన తనకు అమెరికా వెళ్లిపోవడం తప్పనిసరిగా మారిందని అన్నారు. తెలంగాణ గడ్డను వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందని, కానీ తప్పని పరిస్థితి అని చెప్పుకొచ్చారు. తెలంగాణ వాదులందరి తరఫున కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అడ్డు తెరలు లేని ఆత్మీయతకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన కేసీఆర్ అని కొనియాడారు.
Kcr1
Kcr2
Kcr3
Kcr4