సీనియర్ జర్నలిస్ట్ వినయ్ వీర్జీ కన్నుమూత
ప్రముఖ జర్నలిస్ట్, హిందీ మిలాప్ సంపాదకుడు వినయ్ వీర్జీ (72) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదివిన ఆయన.. హిందీ భాషోన్నతికి విశేషంగా కృషిచేశారు.
- సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 27: ప్రముఖ జర్నలిస్ట్, హిందీ మిలాప్ సంపాదకుడు వినయ్ వీర్జీ (72) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదివిన ఆయన.. హిందీ భాషోన్నతికి విశేషంగా కృషిచేశారు. లండన్‌లో ఉన్నత విద్యాభాసం అనంతరం దక్షిణాదిలో హిందీ జర్నలిజం అభ్యున్నతికి పాటుపడ్డారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు యుధ్వీర్ కుమారుడు ఈ యన.
తండ్రి మరణాంతరం యుధ్వీర్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఫొటో జర్నలిస్టుగానూ మంచి గుర్తిం పు తెచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని విస్పర్ వ్యాలీలో ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వినయ్ వీర్జీ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. జాతీయస్థాయి జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

