సబ్బండ వర్ణాలు ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్కు జై కొడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రకటిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేటతండావాసులు, నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనిపూర్ శివారులోని వెంకటేశ్వర క్యాంపు వాసులు మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ ప్రతులను స్పీకర్‌కు అందజేశారు.
-బాన్సువాడ టౌన్/వర్ని