బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అనంతరం పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి హాజరైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణభవన్ వద్ద పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు.