హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్(BRS) అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడంతో పోటీదారులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలతో ప్రచారాన్ని ప్రారంభించి ఇల్లిల్లూ తిరుగుతూ..చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్కు అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధిని చేస్తామంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం గట్టుకాడిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు.నిర్వహించారు. పార్టీ బీఫామ్ అందుకున్న అనంతరం సెంటిమెంట్లో భాగంగా ఇక్కడ పూజలు నిర్వహించి పార్టీ కార్యక్రమాలను ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అనంత పద్మనాభ స్వామి వారిని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి..
వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే ఆనంద్..
చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..