కాంగ్రెస్తోనే తెలంగాణ వెనుకబాటు
తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు.
- బీఆర్ఎస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం
- ఖమ్మం ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ
ఖమ్మం, నవంబర్ 25: తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిపువ్వా డ అజయ్కుమార్ విమర్శించారు. వారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లలో పేదలకు ఇచ్చింది తక్కువని, ఆ పార్టీ నేతలు బుక్కింది ఎక్కువని దుయ్యబట్టారు. శనివారం ఆయన ఖమ్మం నగరంలో పర్యటించారు. ఖమ్మం భూమి పుత్రుడినైన తనను గెలిపిస్తే ఇక్కడి ప్రజల మధ్యే ఉంటానని, వారి కష్టసుఖాల్లో తోడునీడగా నిలుస్తానని హామీ ఇచ్చారు. బయటి వ్యక్తులను ఆదరిస్తే వారు గెలిచినా, ఓడినా మళ్లీ ఇక్కడ కన్పించరని తెలిపారు. తాను మంత్రిగా ఉన్న ఈ ఐదేండ్లలో ఖమ్మంలో 2,500 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు అందించినట్టు చెప్పారు. తనను మరోసారి గెలిపిస్తే 10 వేల మంది పేదలకు ప్రభుత్వ స్థలాలు పంపిణీ చేసి గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉండి తనను అధిక మెజార్టీతో గెలిపిస్తే హైదరాబాద్ తర్వాత అంతలా అభివృద్ధి చెందిన నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

