Telangana Engineers Day | నేడు తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం.. అపర భగీరథుడు బహదూర్ సాబ్‌కు బీఆర్ఎస్ నివాళి
Telangana Engineers Day | అలనాటి అపర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. తెలంగాణ గర్వించ దగిన విలక్షణమైన ఇంజినీర్. ఆయన జయంతిని ప్రతి ఏడాది తెలంగాణ ఇంజినీర్స్ డేగా నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. నవాజ్ జంగ్ బహదూర్ 147వ జయంతి సందర్భంగా.. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఘననివాళులర్పించింది.
Telangana Engineers Day | హైదరాబాద్ : అలనాటి అపర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. తెలంగాణ గర్వించ దగిన విలక్షణమైన ఇంజినీర్. ఆయన జయంతిని ప్రతి ఏడాది తెలంగాణ ఇంజినీర్స్ డేగా నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. నవాజ్ జంగ్ బహదూర్ 147వ జయంతి సందర్భంగా.. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఘననివాళులర్పించింది.
ఇక బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఏడాది తెలంగాణ ఇంజినీర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారు. జలసౌధలో నవాజ్ జంగ్ బహదూర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేవారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఇంజినీర్స్ డేను నిర్వహించడం మరిచిపోయినట్లుంది. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టుల రూపకర్త అయిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం స్మరించుకోకపోవడం శోచనీయం.
నవాజ్ జంగ్ బహదూర్ నేపథ్యం ఇదే..
నదులను ఒడిసి పట్టి సాగు, తాగునీటి వనరులను భవిష్యత్ తరాలకు అందించిన గొప్ప దార్శనికుడు. నైజాం కాలంలో ఆయన నీటి వనరుల నిపుణుడిగా ప్రఖ్యాతిగాంచాడు. వలస పాలనలో ఆయన చరిత మరుగున పడిపోయినప్పటికీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సర్కార్ ఆయన సేవలను వెలుగులోకి తెచ్చింది. నాటి సీఎం కేసీఆర్ ఆయన చేసిన కృషికి గాను ఏటా జూలై 11న నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా ‘రాష్ట్ర ఇంజినీర్స్ డే’ నిర్వహించాలని నిర్ణయించారు. 2014 నుంచి ఏటా ఇదే తేదీన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇంజినీర్స్, సాంకేతిక నిపుణులు ఆయన సేవలను ప్రజలకు చాటి చెప్తున్నారు. నవాబ్ జంగ్ ఆయన దార్శనికతతో మన జిల్లాకు ‘జల వరాలు’ అందించారు.
వరదాయిని పాలేరు జలాశయం
మనం నేడు గొప్పగా చెప్పుకునే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, దిండి, కోయల్‌సాగర్, కడెం , పోచంపాడు, లోయర్ మానేరు ప్రాజెక్టులన్నీ నవాజ్ జంగ్ నిర్మించినవే. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ, ఉస్మానియా ఆస్పత్రి అన్నీ ఆయన కాలంలో రూపుదిద్దుకున్నవే. ఇదే ఒరవడిలో 1920లో గుర్రాలపై ఖమ్మం ప్రాంతానికి వచ్చారు నవాజ్ జంగ్. పాలేరు చెరువును చూసిన ఆయన అక్కడ అనకట్ట నిర్మించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని నైజాం నవాబుకు తెలపడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1922లో పనులు ప్రారంభిస్తే 1928 నాటికి పూర్తయ్యాయి. 1929లో ప్రాజెక్టును ప్రారంభమైంది. ఏటా కుడి, ఎడమ కాలువల ద్వారా 2.5 టీఎంసీల నీరు 19,500 ఎకరాల ఆయకట్టుకు అందేలా ఆనకట్ట నిర్మించారు.
వైరా ప్రాజెక్టు నిర్మాణ శిల్పి..
వైరాకు సమీపంలో వైరా నదిపై 1923లో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. 1930లో పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కింద 17,390 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమైంది. వైరా, తల్లాడ, బోనకల్లు మండలాల్లోని సాగుభూములకు దీని ద్వారా సాగునీరు అందుతుంది. ఏన్కూరు, కామేపల్లి, కారేపల్లి మండలాలకు ఇక్కడి నుంచి వచ్చే వరద నీరే ప్రధాన అదరువు. ఈ ప్రాజెక్టు పరిధిలో కుడి, ఎడమ కాల్వలు ఉన్నాయి.
మున్నేరు బ్రిడ్జి నిర్మించిందీ ఆయనే..
ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు సమీపంలో మున్నేరుపై ఉన్న వంతెనకు 1917లో నవాజ్ జంగ్ పనులు ప్రారంభించారు. నాలుగేళ్లలో వంతెన పూర్తి చేశారు. పూర్తిగా రాయి కట్టుబడితో నిర్మించిన ఈ వంతెన వందేళ్లు పూర్తయినా చెక్కు చెదరక పోవడం ఆయన మేధస్సుకు తార్కాణం.
Today is Telangana Engineers’ Day
The services of the renowned irrigation engineer Sri Nawab Ali Nawaz Jung Bahadur are exemplary. It is a fitting tribute to celebrate his birthday as Telangana Engineers’ Day.
Heartfelt wishes to all engineers. pic.twitter.com/ixqm7XaM6Y
— BRS Party (@BRSparty) July 11, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

