న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28న ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆదివారం ప్రవేశపెడతారు. సమావేశాల ప్రారంభ రోజైన 28న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు గంటల పాటు ప్రసంగిస్తారని సమావేశాల తాత్కాలిక షెడ్యూల్‌ను పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.
మరునాడు బీటింగ్ రీట్రీట్ వేడుక ఉండటంతో జనవరి 29న రెండు సభలు సమావేశం కావు. 30న జరిగే సమావేశంలో ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. జనవరి 31న రెండు సభలు సమావేశం కావు. ఫిబ్రవరి 1న ఆదివారం సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్‌పై ధన్యవాద తీర్మానంపై చర్చల తర్వాత ఫిబ్రవరి 13న పార్లమెంట్ దాదాపు నెల రోజుల పాటు వాయిదా పడుతుంది. పార్లమెంట్ మార్చి 9న తిరిగి సమావేశమై ఏప్రిల్ 2న గురువారం ముగుస్తుంది.