అబిడ్స్, డిసెంబర్13: జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రజాదరణతో దూసుకెళ్లడం ఖాయమని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేక మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నాని తెలిపారు.
బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఎంకె బద్రుద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జాల్నా, షోలాపూర్, పర్భనీ, నాందేడ్, బీడ్ తదితర ప్రాంతాల్లోని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 100 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి మహమూద్ అలీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రవీందర్రావు, సుబ్బారావు, వెంకట్రావు, శివాజీరావు, కండూరావు, అప్పారావు, నాగూరావు, దోండేరావు, రిజ్వాన్, రజాక్, రఫీ, ఇస్మాయిల్, ఆరిఫ్, ఆసిఫ్, హర్షద్, మునీర్ తదితరులు పాల్గొన్నారు.