Urea Shortage | రాష్ట్రంలో యూరియా కొరతపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎరువుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానల వల్ల కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని ఎమ్మెల్యేలు కేటీఆర్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్ కోరారు.
మరోవైపు యూరియా కొరతపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలో నిరసన తెలిపారు. షాపుల్లో దొరకని యూరియా యాప్‌ల్లో దొరుకుతుందా?, కాంగ్రెస్ వచ్చింది.. యూరియా కొరత వచ్చిందని ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో శాసన సభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో లోనికి వెళ్లవద్దని సూచించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. నేను మాట్లాడిన తర్వాతనే మీకు సరెండర్ లీవ్‌ల డబ్బులు వచ్చాయి.. ఇప్పుడు యూరియా మీద కూడా రైతుల పక్షాన మాట్లాడితేనే యూరియా వస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.

Adjournment Resolution