హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. నిరుద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో బీఆర్ఎస్ (BRS) వాయిదా తీర్మానం కోరుతూ నోటీసులు ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్రకటనతోపాటు ఇతర న్యాయ పరమైన డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి, నిరుద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వ అణచివేత వైఖరిపై చర్చ చేపట్టాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నోటీసులిచ్చారు.