బండ్లగూడ, జూలై 25 : ఫుడ్‌కోర్టు వ్యాపారి నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏసీబీ సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఓ ఫుడ్ కోర్టులో అక్రమాలు ఉన్నాయని, రూ.5 లక్షలు ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ డిమాండ్ చేశాడు.
దీంతో ఆ ఫుడ్కోర్ట్ వ్యాపారి ఏసీబీ ని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ఫిర్యాదుదారుడు రూ.2 లక్షలు ఇచ్చేందుకు డిప్యూటీ కమిషనర్‌ను ఒప్పించారు. ఈ మేరకు రవికుమార్‌కు ఫుడ్‌కోర్టు యజమాని రూ.2 లక్షలు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయని, ఆధారాలు లేకపోవడంతో విచారణ జరుపుతూ వస్తున్నామని పేర్కొన్నారు.