కరీంనగర్ రాంనగర్, జూన్ 10: కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కమిషన్ పద్ధతిలో బినామీ అకౌంట్ల ద్వారా లంచాలు తీసుకున్న కరీంనగర్ జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాధికను కరీంనగర్ ఏసీబీ అధికారులు అరెస్టుచేశారు.
లబ్ధిదారులకు నిత్యావరస సరుకులు, గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రాధిక పర్యవేక్షిస్తున్నది. ప్రతి బిల్లుకూ రాధిక బినామీ అకౌంట్ల ద్వారా కమిషన్ తీసుకునేది. దీంతో బిల్లుల చెల్లింపు విషయంలో ఇబ్బందుల కు గురి చేస్తున్నదని పలువురు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వివిధ అకౌంట్లకు రూ.2.37 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకొని, కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.